Share News

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:14 AM

ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎనఎస్‌ఎస్‌ పీఓ హఫీజ్‌ పేర్కొన్నారు.

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
మంగాపురంలో అవగాహన కల్పిస్తున్న ఎనఎస్‌ఎస్‌ వలంటీర్లు

ప్రజలకు అవగాహన కల్పించిన ఎనఎస్‌ఎస్‌ వలంటీర్లు

పెనుకొండ రూరల్‌, ఫిబ్రవరి 6 : ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎనఎస్‌ఎస్‌ పీఓ హఫీజ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆఽధ్వర్యంలో పెనుకొండ నగర పంచాయతీలోని మంగాపురంలో ఎనఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందుంలో భాగంగా గ్రామంలో నాలుగోరోజు మంగళవారం గ్రామస్థులకు రక్తహీనతకు సంబంధించి మాత్రలు పంపిణీ చేశారు. పౌష్టికాహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై వివరించారు. ధూమపానం, మద్యపానం వల్ల కలిగే అనర్థాలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బషీర్‌ అహ్మద్‌, చరిత్ర అధ్యాపకులు నరసింహమూర్తి, పీఓ శంకర్‌నాయక్‌, ఎనఎస్‌ఎస్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

గోరంట్ల: మండలంలోని ఎముకలగుట్టపల్లిలో ఎస్‌ఏపీఎస్‌ జూనియర్‌ కళాశాల ఎనఎస్‌ఎస్‌ వలంటీర్లు శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. కళాశాల ఆవరణంలోని పిచ్చి మొక్కల ను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ అడవాల సూర్యనారాయణ, ఏఎనకే డిగ్రీ కళాశాల ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలోని యువతకు కేరీయర్‌ కౌన్సిలింగ్‌, కమ్యూనికేషన స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. అధ్యాపకులు రమేష్‌, ఎనఎస్‌ఎస్‌ పీఓ బాబు, విద్యార్థులున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:14 AM