Share News

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై లోకేశకు ఫిర్యాదు

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:30 AM

పుట్టపర్తిరూరల్‌ మార్చి 8: మండలంలో ఎంతో కాలం నుంచి నిరుపేద రైతులు అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములను వారి నుంచి వైసీపీ నాయకులు లాక్కొని పట్టాలు తెచ్చుకున్నారని పెడపల్లి మాజీ సర్పంచు శ్రీరాంనాయక్‌ , టీడీపీ మండల కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై లోకేశకు ఫిర్యాదు

పుట్టపర్తిరూరల్‌ మార్చి 8: మండలంలో ఎంతో కాలం నుంచి నిరుపేద రైతులు అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములను వారి నుంచి వైసీపీ నాయకులు లాక్కొని పట్టాలు తెచ్చుకున్నారని పెడపల్లి మాజీ సర్పంచు శ్రీరాంనాయక్‌ , టీడీపీ మండల కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశకు ఫిర్యాదు చేశారు. కొత్తచెరువు మండలకేంద్రంలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో వారు లోకేశను కలిసి మాట్లాడారు. పెడపల్లి, గువ్వలగుట్టపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 80 ఎకరాలు రెవెన్యూ భూమి అన్యాక్రాంతమైందని, గతంలో అనుభవంలో ఉన్న పేద రైతులను కాదని వైసీపీ నాయకులు పట్టాలు మంజూరు చేయించుకున్నారని తెలియజేశారు. అధికారులు ఓ నాయకుడికి సుమారు 30 ఎకరాల భూమిని కేటాయించి పేదలకు అన్యాయం చేశారని వాపోయారు. ఈ విషయంపై స్పందించిన నారాలోకేశ తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని అనుభవంలో ఉన్న రైతులకే అందజేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 09 , 2024 | 12:30 AM