ఆరాధనోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:11 AM
పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ లోని శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలను మంగళవారం వైభవంగా నిర్వ హించారు.
ధర్మవరం, ఆగస్టు 20 : పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ లోని శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలను మంగళవారం వైభవంగా నిర్వ హించారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహి స్తామని ఆలయ ధర్మకర్త పద్మనాభ ఆచారి తెలిపారు. మొదటి రోజు పూర్వ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహిం చామన్నారు. పంచామృతాభిషేకం, కనక మహాపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అదే విధంగా మార్కెట్‌యార్డ్ వద్ద ఉన్నమారుతీ రాఘవేం ద్రస్వామి ఆలయంలో కూడా స్వామివారి ఆరాధనోత్స వాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, పోలా ప్రభాకర్ పాల్గొన్నారు.