రా.. కదలిరా సభను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:08 AM
మండలంలోని కియ పరిశ్రమ వద్ద సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలిరా క బహిరంగసభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.
టీడీపీ నాయకులు
పెనుకొండ, మార్చి 2: మండలంలోని కియ పరిశ్రమ వద్ద సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలిరా క బహిరంగసభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. ఆయన శనివారం స్థానిక కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు పార్యటనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలిరా కార్యక్రమం సోమవారం కియ పరిశ్రమవద్ద మధ్యాహ్నం 3గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రవీంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు, నాయకులు మునిమడు గు వెంకటరాముడు, కేశవయ్య, రొద్దం నరసింహులు, సుబ్బరత్నమ్మ, లక్ష్మీరెడ్డి, నాగరాజు, జావిద్, హుజూర్, నరహరి తదితరులు పాల్గొన్నారు.
మడకశిరటౌన: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా సభ ను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గం అభ్యర్థి సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న పిలుపునిచ్చారు. వారు శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అవినీతి, అక్రమ పాలనకు చరమగీతం పాడుదామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి రాజధాని, యువతకు ఉపాధి లభిస్తాయ న్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి, పరిశ్రమల స్థాపన, పేదలకు సంక్షేమ ఫలా ల అందజేత నెరవేరుతాయన్నారు. అన్ని రకాల రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే నేత చంద్రబాబు అన్నారు. నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున రాకదలిరా సభకు తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆది నారాయణ, రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్ర నరసింహప్ప, మండల మాజీ కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు, కెంచప్ప, కిష్టప్ప, నాగరాజు, మంజునాథ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
రొళ్ల: టీడీపీ అధినేత చంద్రబాబు కియ పరిశ్రమ ఎదుట సోమవారం నిర్వహించే రా కదలిరా సభను విజయవంతం చేయాలని వక్కలిగ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వీఎం పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్ కో రారు. వారు శనివారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నియోజక వ ర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.