Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రా.. కదలిరా.. సభకు తరలిరండి: పల్లె

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:36 AM

పుట్టపర్తి, మార్చి 3 : పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమ వద్ద సోమవారం రా కదలిరా పేరిట బహిరంగ సభ జరగనుందని, ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు.

రా.. కదలిరా.. సభకు తరలిరండి: పల్లె

పుట్టపర్తి, మార్చి 3 : పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమ వద్ద సోమవారం రా కదలిరా పేరిట బహిరంగ సభ జరగనుందని, ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కొత్తచెరువు: పెనుకొండ వద్ద కియ సమీపంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించే రా కదలిరా మహాసభకు మండలంలోని టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆపార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సాలక్కగారిశ్రీనివాసులు, మండల, పట్టణ కన్వీనర్లు అడపాల రామకృష్ణ, ఒలిపిశీన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తలపెట్టిన రా.. కదలిరా.. కార్యక్రమానికి మం డలంలోని టీడీపీ శ్రేణులు, మేధావులు, యువకులు తరలి రావాలన్నారు. కార్యక్రమం లో నాయకులు డ్రైవర్‌ కేశప్ప, నల్లమాడ శంకర్‌,సుబ్రమణ్యం,పెద్దన్న,డేగల కృష్ణమూర్తి, చంద్రమోహన, పెద్దన్న, శివాజీ, చిరంజీవి పాల్గొన్నారు.

ఓబుళదేవరచెరువు: టీడీపీ అధినేత చంద్రబాబు పెనుకొండ వద్ద తలపెట్టిన రా... కదిలిరా... సభను విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరె డ్డి, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. రా.. కదిలిరా... కార్యక్రమానికి మండలనుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, అ భిమానులు మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో సభకు తరలాలని కోరారు.

నల్లచెరువు: పెనుకొండ సమీపంలో సోమవారం నిర్వహించే రా.. కదిలిరా... బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ మండల కన్వీనర్‌ పీ.రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ మాబూసాబ్‌ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. కదిరి నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో అందరూ తరలిరావాలని కోరారు. సభకు పార్టీ అధినేత చంద్రబాబు రానున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 04 , 2024 | 12:36 AM