Share News

ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:08 AM

ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదుల క్లెయిమ్స్‌ పరిష్కారానికి వేగంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టరు గౌతమి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆమె కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు సవరణలో వచ్చిన ఫిర్యాదులను పక్కాగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తాం
మాట్లాడుతున్న కలెక్టరు

జేఎనటీయూలో కౌంటింగ్‌ కేంద్రాలు

కలెక్టరు గౌతమి

అనంతపురం టౌన, ఫిబ్రవరి 28: ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదుల క్లెయిమ్స్‌ పరిష్కారానికి వేగంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టరు గౌతమి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆమె కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు సవరణలో వచ్చిన ఫిర్యాదులను పక్కాగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫారం 6, 7, 8 క్లెయిమ్స్‌ను ఎన్నికల నిబంధనల మేరకు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఫారం 7కు సంబంధించి మృతులు, డూప్లికేట్‌ ఓటర్లను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్ల ఎపిక్‌ కార్డులు ఇప్పటికి 2.20 లక్షలు వచ్చాయని, పోస్టు ద్వారా ఓటర్ల ఇళ్లకు పంపిస్తున్నామని తెలిపారు. మిగిలిన కార్డులు మరో మూడురోజుల్లో వస్తాయని, వెంటనే వాటిని ఓటర్లకు పంపిస్తామని తెలిపారు. పత్రికలలో వ్యతిరేకవార్తలు వస్తే, నిజమా... కాదా అని పరిశీలించిన తరువాతనే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జేఎనటీయులో కౌంటింగ్‌ కేంద్రాలు, సా్ట్రంగ్‌రూమ్స్‌ ఏర్పాటు చేశామని కలెక్టరు తెలిపారు. మొత్తం మూడు బ్లాక్‌లలో ఎనిమిది నియోజకవర్గాలకు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జేఎనటీయూ మెయిన బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తాడిపత్రి, మొదటి ఫ్లోర్‌లో రాయదుర్గం, గుంతకల్లు, అడ్మినిస్ట్రేషన బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉరవకొండ, మొదటి ఫ్లోర్‌లో శింగనమల, కళ్యాణదుర్గం, ఈసీఈ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అనంతపురం అర్బన, మొదటి ఫ్లోర్‌లో రాప్తాడు నియోజకవర్గ కౌంటింగ్‌ కేంద్రాలు, సా్ట్రంగ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల కమిషన ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రాజకీయపార్టీల ప్రతినిధులు జేఎనటీయూకు వచ్చి పరిశీలించి, సూచనలు చేయాలని ఆమె కోరారు. సమావేశంలో డీఆర్వో రామక్రిష్ణరెడ్డి, డిప్యూటీ కలెక్టరు విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:08 AM