Share News

tdp: కూటమి అధికారంలోకి రావడం ఖాయం: కందికుంట

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:35 AM

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 27: కూటమి ప్రభుత్వ ఏర్పాటు తథ్యమ ని, చంద్రబాబు సీఎం ఖావడం ఖాయమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. కదిరి మండలం ఎర్రదొడ్డి, రామదాసునాయక్‌తండా, బోడేనాయక్‌తండా, ఎర్రదొడ్డి క్వార్టర్స్‌, కదిరి కుంట్లపల్లి గ్రామాల్లో శనివారం ఆ యన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

tdp: కూటమి అధికారంలోకి రావడం ఖాయం: కందికుంట
ఎర్రదొడ్డి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కందికుంట

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 27: కూటమి ప్రభుత్వ ఏర్పాటు తథ్యమ ని, చంద్రబాబు సీఎం ఖావడం ఖాయమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. కదిరి మండలం ఎర్రదొడ్డి, రామదాసునాయక్‌తండా, బోడేనాయక్‌తండా, ఎర్రదొడ్డి క్వార్టర్స్‌, కదిరి కుంట్లపల్లి గ్రామాల్లో శనివారం ఆ యన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటింటా తిరిగి సూపర్‌ సిక్స్‌పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు సీఎం అయితే వీటిని అమలు చేస్తారన్నారు. తాను నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధిని గెలిపించాలని కోరారు. జన స్పందనను చూస్తుంటే కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చెన్నకేశవులు, చ క్రధర్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, హరి, చంద్ర, ఉప్పాల ప్రసాద్‌, అంజి, కరుణాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, బంగారు కృష్ణమూర్తి కుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 28 , 2024 | 12:35 AM