అంగనవాడీల సమస్యల పరిష్కారంలో.. సీఎం విఫలం
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:16 AM
ధర్మవరం, జనవరి 17: అంగనవాడీల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన విఫలం చెందారని సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్ మండిపడ్డారు. న్యాయమైన సమస్యలకు పరిష్కారం కోరుతూ పట్టణంలోని అంగనవాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుఽధవారం నాటికి 37వ రోజుకు చేరింది.
ధర్మవరం, జనవరి 17: అంగనవాడీల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన విఫలం చెందారని సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్ మండిపడ్డారు. న్యాయమైన సమస్యలకు పరిష్కారం కోరుతూ పట్టణంలోని అంగనవాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుఽధవారం నాటికి 37వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు సీపీఐ జిల్లాకార్యదర్శివేమయ్యయాదవ్, ఏపీచేనేత కార్మికసంఘం తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం సీనియర్ నాయకుడు ఎస్‌హెచబాషా, సీఐటీయూ మండల అధ్యక్షుడు ఎల్‌ఆదినారాయణల సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా వేమయ్యయాదవ్ మాట్లాడుతూ... గత 37 రోజులుగా అంగనవాడీలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అదీగాక ఎస్మా ప్రయోగంతో అంగనవాడీలను బెదిరించాలని చూడడం హేయమన్నారు. జగన పాదయాత్రలో ఇచ్చిన హామీలనే అంగనవాడీలు అడిగారని, వీటిని కూడా సీఎం అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటే సమస్యల పరిష్కారంలో సీఎం విఫలమైనట్టేనని పేర్కొన్నారు.