Share News

WATER ; టీచర్స్‌ కాలనీలో మూతపడ్డ వాటర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:52 PM

పట్టణంలోనే మంచి గుర్తింపు ఉన్న ప్రాంతం టీచర్స్‌ కాలనీ. బెంగళూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉంది. నెల రోజులుగా వాటర్‌ ప్లాంట్‌ మూత పడడంతో స్థానికులు శుద్ధజలం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో గత టీడీపీ హ యాం లో ఓ వ్యక్తి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చాక దానిని తొలగించారు. కొత్తవారు వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి స్థానికులకు రూ. 6కు బిందె ప్రకారం నీరందిస్తున్నారు.

WATER ; టీచర్స్‌ కాలనీలో మూతపడ్డ వాటర్‌ ప్లాంట్‌
A damaged bore well

తాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

హిందూపురం అర్బన, మే 25: పట్టణంలోనే మంచి గుర్తింపు ఉన్న ప్రాంతం టీచర్స్‌ కాలనీ. బెంగళూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉంది. నెల రోజులుగా వాటర్‌ ప్లాంట్‌ మూత పడడంతో స్థానికులు శుద్ధజలం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో గత టీడీపీ హ యాం లో ఓ వ్యక్తి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చాక దానిని తొలగించారు. కొత్తవారు వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి స్థానికులకు రూ. 6కు బిందె ప్రకారం నీరందిస్తున్నారు. ఈ ప్లాంటుకు మున్సిపల్‌ బోరుద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వాటర్‌ ప్లాంటుకు నీరందించే మున్సిపల్‌ బోరు నెలకిందట మరమ్మతులకు వచ్చింది. వాటర్‌ ప్లాం టును తాత్కాలికంగా మూసి వేశారు.


దీంతో నెలరోజుల నుంచి టీటర్స్‌ కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు అవతల దూరంగా ఉండే ప్రైవేట్‌ ప్లాంట్‌ నుంచి వారు తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బోరుకు మరమ్మతులు చేసి తమకు తాగునీరు అందేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు మునిసిపల్‌ బోరు నీటిని ఉచితంగా అందిస్తున్నారు. ప్లాంటుకు అయ్యే కరెంటు ఖర్చును మునిసిపల్‌ శాఖ ఖాతాలోనే కడుతున్నట్లు సమాచారం. ప్లాంట్‌ ద్వారా నీటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం మాత్రం యాజమాన్యం వంతుగా మారింది. ఇంత లాభం పొందుతూ కనీసం బోరుకు మరమ్మతులు చేయించకుండా ప్లాంట్‌ను మూతవేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ ఆ కాలనీలోనే నివాసముంటున్నారు. వైస్‌ చైర్మన బలరామి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంతో మునిసిపల్‌ పాలక వర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులతో సంబంధం ఉన్నా... ప్రయోజనం ఏమిటని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోరుకు మరమ్మతులు చేయిం చి ప్లాంటు ద్వారా తాగునీటిని అందించాలని కోరుతున్నారు. ఈ విషయం పై మునిసిపల్‌ శాఖ డీఈ బాలసుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరగా.... బోరు మర మ్మ తులకు వచ్చినట్లు సిబ్బంది ఆలస్యంగా తెలిపారన్నారు. రెండు రోజుల్లో మరమ్మ తులు చేపట్టి టీచర్స్‌ కాలనీ వాసులకు తాగు నీరు అందేలా చేస్తామన్నారు.


నెలరోజులుగా ఇబ్బంది పడుతున్నాం- అశ్వత్థప్ప, టీచర్స్‌ కాలనీ

స్థానికంగా వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేసినప్పటి నుంచి కొన్నేళ్లుగా మినరల్‌ వాటర్‌కు అలవాటు పడినాం. అయితే ప్లాంట్‌ మూతపడి నెలరోజులు కావ స్తోంది. దాన్ని తెరిపించేందుకు ఎవరూ ప్రయత్నించడంలేదు. దీంతో తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం.

రోడ్డు అవతల నుంచి నీరు తెచ్చుకుంటున్నాం- లక్ష్మి, టీచర్స్‌ కాలనీ

తాగునీరు కావాలంటే బెంగళూరు రోడ్డు దాటి అవతల ఉన్న ప్రైవేట్‌ ప్లాంట్‌ నుంచి తెచ్చుకుంటున్నాం. దూరం నుంచి క్యాన మోసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉం టుంది. పైగా ప్రధాన రోడ్డు దాటి వెళ్లాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.

తాగునీటికి అవస్థలు పడుతున్నాం - రాజనాథ్‌ చౌహాన, టీచర్స్‌ కాలనీ

కాలనీలో ఉంటే ప్లాంటు మూతపడడంతో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో విధంగా తాగునీరు తెచ్చుకోవాలి. లేదంటే కొళాయిల్లో వచ్చిన నీటినే తాగాలి. కొళాయిల్లో వచ్చే నీటిని తాగలేక కష్టపడి సైకిల్‌పై రోడ్డుదాటి శుద్ధ జలం తెచ్చుకుంటున్నాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 25 , 2024 | 11:52 PM