Share News

AP campaining: భవిష్యత్తును కాపాడేవారినే ఎన్నుకోండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:58 PM

ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తును కాపాడే నాయకులను ఎన్నుకోవాలని జడ్పీ సీఈఓ మైఖోమ్‌ నిదియా పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జడ్పీ సీఈఓ ప్రారంభించారు.

AP campaining: భవిష్యత్తును కాపాడేవారినే ఎన్నుకోండి
ZP CEO, Deputy CEO, Art of Living and members of Election Vigilance Platform attended the rally.

జడ్పీ సీఈఓ మైఖోమ్‌ నిదియా

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 28: ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తును కాపాడే నాయకులను ఎన్నుకోవాలని జడ్పీ సీఈఓ మైఖోమ్‌ నిదియా పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జడ్పీ సీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధమని తెలిపారు. ప్రతి ఓటరు అవినీతి లేని సమాజ స్థాపన, అభివృద్ధిని కాంక్షించే నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోని ప్రజలు సమస్యలు పరిష్కరించాలని అడిగే హక్కు కోల్పోతారని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌, శ్రీకంఠం సర్కిల్‌, రాజురోడ్డు, సప్తగిరిసర్కిల్‌, సుభా్‌షరోడ్డు, టవర్‌క్లాక్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయి, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ జిల్లా ప్రతినిధి మమత, ఎన్నికల నిఘావేదిక రీజనల్‌ కన్వీనర్‌ కంబదూరు షేక్‌ నబీరసూల్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Apr 28 , 2024 | 11:58 PM