Share News

చిర్రెత్తిస్తున్న ఫోనకాల్స్‌

ABN , Publish Date - May 03 , 2024 | 11:50 PM

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీసత్యసాయిజిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను 78 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

చిర్రెత్తిస్తున్న ఫోనకాల్స్‌
cell canvasing

సోషల్‌ మీడియాలో ప్రధాన పార్టీల ప్రచారాల జోరు

పదునైన విమర్శలు చేసుకుంటున్న వైనంకొత్తచెరువు, మే 3 : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీసత్యసాయిజిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను 78 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు ప్రజల మద్దతు పొందేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు సోషల్‌ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు పదునైనా విమర్శలు చేసుకుంటూ హోరెత్తిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌.. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలను ప్రజలకు తెలియజేసేందుకు వాహనాలకు పెద్దపెద్ద డిజిటల్‌ టీవీ స్ర్కీన్లను ఏర్పాటుచేసి జనసముహం ఉన్నప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన కలిగి ఉన్నారు. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సెల్‌ఫోన్లను ప్రచార అస్ర్తాలుగా వినియోగించుకుంటున్నారు. ‘నేను మీ పలాన పార్టీ అభ్యర్థిని.. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేసి ఆశీర్వదించాలి.. ఇట్లు మీ బిడ్డ, మీ నాయకుడు’ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఫోన ఎత్తితే ఇదే గోల. ఈ ప్రచారాలతో జనాలు చిర్రెత్తుతున్నారు.

Updated Date - May 03 , 2024 | 11:50 PM