Share News

ప్రశాంతి నిలయంలో చైనీస్‌ సంబరాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:21 AM

పుట్టపర్తి, ఫిబ్రవరి 16: చైనా నూతన సంవత్సర వేడుకలను ఆ దేశ భక్తులు శుక్రవారం స్థానిక ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ప్రశాంతి నిలయంలో చైనీస్‌ సంబరాలు

పుట్టపర్తి, ఫిబ్రవరి 16: చైనా నూతన సంవత్సర వేడుకలను ఆ దేశ భక్తులు శుక్రవారం స్థానిక ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత హాల్‌లో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సాయికుల్వంత మందిరంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. సత్యసా యి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, సభ్యుడు చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి, చైనా వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదట ఆ దేశ భక్తులు డ్రాగన డ్యాన్సతో అలరించారు. చైనాదేశ సేవాసంస్థల కోఆర్డినేటర్‌ జెక్లిన మాట్లాడుతూ.. సత్యసాయి ప్రేమతత్వం అనన్యమనీ, సాయి చూపిన బాటలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం చోంగ్‌చ్యూసెన బృందం సంగీత కచేరితో భక్తులను అలరించింది. చైనా సంప్రదాయ సంగీతంతో గంటపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు నృత్యంతో అలరించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌, మాల్‌దీవ్స్‌ నుంచి దాదాపు 500 మంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:21 AM