Share News

‘ప్రతిఒక్కరిలోనూ మార్పు రావాలి’

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:35 AM

కదిరి లీగల్‌, జనవరి 27: ప్రతిఒక్కరిలోనూ మా ర్పు రావాలని, మా ర్పుతోనే భవిష్య త్తు ఉంటుందని న్యాయాఽధికారులు ఎస్‌. జయలక్ష్మి, ఎస్‌. ప్రతిమ ఖైదీలకు సూచిం చారు. పట్టణంలోని సబ్‌జైలును శనివారం వారు తనిఖీ చేశారు.

‘ప్రతిఒక్కరిలోనూ మార్పు రావాలి’

కదిరి లీగల్‌, జనవరి 27: ప్రతిఒక్కరిలోనూ మా ర్పు రావాలని, మా ర్పుతోనే భవిష్య త్తు ఉంటుందని న్యాయాఽధికారులు ఎస్‌. జయలక్ష్మి, ఎస్‌. ప్రతిమ ఖైదీలకు సూచిం చారు. పట్టణంలోని సబ్‌జైలును శనివారం వారు తనిఖీ చేశారు. మొదట జైలులో ఖైదీలకు ఇస్తున్న కూరగాయలు, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. అనంతరం భోజనాన్ని రుచి చూశారు. తర్వాత మాట్లాడుతూ.. పంతాలు, పట్టింపులు, పరాక్రమాలకు వెళ్లి, క్షణికావేశాల్లో తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తప్పులు చేసేవారు భార్యాబిడ్డలకు సమాజంలో ఎదురయ్యే అవమానాలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరిలోనూ మంచిగా మార్పు రావాలన్నారు. లోక్‌అదాలతను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వారి వెంట న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:35 AM