swearing-in ceremony చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కూటమి శ్రేణుల సంబరం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:25 PM
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విజయవాడ లోని కేసరపల్లిలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్రజ్యోతి, న్యూననెట్‌వర్క్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విజయవాడ లోని కేసరపల్లిలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇందుకు గాను పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల వ్యా ప్తంగా కూటమిశ్రేణులు. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం సంబరాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బాణ సంచా కాల్చారు. కేక్‌లు కట్ చేశారు. పలు చోట్ల చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బైక్ ర్యాలీలు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇంకా కొన్ని చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...