Share News

రేపు రాప్తాడుకు చంద్రబాబు రాక

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:43 PM

రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ప్రజాగళం సభ నిర్వహిస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ నియోజక వర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పిలుపుని చ్చారు.

రేపు రాప్తాడుకు చంద్రబాబు రాక
మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌,

రాప్తాడు, మార్చి 26: రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ప్రజాగళం సభ నిర్వహిస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ నియోజక వర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పిలుపుని చ్చారు. మంగళవారం ప్రజాగళం సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నగ రంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వా రు మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాప్తాడు నియోజకవర్గంకు వస్తున్నారని, ఈ ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు రాప్తాడు బస్టాండ్‌ వద్ద రోడ్‌ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు. అన్ని మండలాల నుంచి జనం తరలివచ్చేలా నాయకులు ఏ ర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో చంద్ర బాబు ఎక్కడికి వెళ్లినా భారీగా జనాలు వస్తు న్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కా వాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుం టున్నా రన్నారు. అన్ని ప్రాంతాల కంటే రాప్తాడులో అత్యధికంగా జనాలు తరలివచ్చి విజయ వంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గటీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జగనను ఓడించేందుకు లక్ష కారణాలున్నాయ్‌..

అనంతపురం అర్బన : సీఎం జగనను ప్రజలు ఓడించేందుకు లక్ష కారణాలు న్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆమె నివాసమంలో మీడియాతో మాట్లాడుతూ.... జగన ఐదేళ్ల పాలనలో ఏ వర్గానికీ మంచి చేయలేదన్నారు. జగన ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చలే దన్నా రు. ప్రతి సభలోనూ 99 శాతం హామీలు నెరవేర్చానంటూ అబద్దాలు చెబు తూ ప్రజ లను మరో సారి మభ్యపెట్టేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. మద్య పాన నిషేధం చేస్తామన్న మాట తప్పడంతో పా టు అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మా ర్చుకొని నాసిరకం మద్యాన్ని విక్రయించి లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంతో చెలగా డం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచి, ప్రజ లపై రూ.64 వేల కోట్ల భారం మోపా రన్నారు. మెగా డీఎస్సీ అంటూ ఎన్నికల సమయంలో దగా డీఎస్సీని విడుదల చేసి యువతను మోసం చేశాడన్నారు. రాష్ట్రం లో ని అన్ని ప్రాంతాల్లో ఇసుక దోపిడీకి పాల్ప డుతూ సామాన్య ప్రజలకు ఇసుక లేకుండా చేశారన్నారు. ఇలా చెప్పుకుం టూపోతే అన్ని వర్గాల ప్రజలకు జగన చేసిన మోసాలు చాలా ఉన్నాయన్నారు. ఐదేళ్లల్లో రూ.8 లక్షల కోట్లకుపైగా అక్రమా ర్జన చేశాడని, అలాంటి జగనను ఇంటికి సాగనంపేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈకార్యక్ర మంలో రాప్తాడు మండలం టీడీపీ కన్వీనర్‌ కురబ కొండప్ప, బోయ జయరాములు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:43 PM