Share News

విజన ఉన్న నాయకుడు చంద్రబాబు: సవిత

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:19 AM

రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో విజన ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు.

విజన ఉన్న నాయకుడు చంద్రబాబు: సవిత
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సవిత

పెనుకొండ టౌన, జనవరి 16 : రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో విజన ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద మంగళవారం నాసిన ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా పట్టణంలోని అన్న క్యాంటినలో సవిత టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సవిత మాటా ్లడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాసిన కోసం భూసేకరణతో పాటు అనేక మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. వీటితోపాటు కియ లాంటి పరిశ్రమ తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అధికార పార్టీ వైసీపీ యు వతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొండి చేయి చూపిందన్నా రు. ఇప్పటికైనా యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే టీడీపీతోనే అన్నారు. మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, గుట్టూరు మాజీ స ర్పంచ సూర్యనారాయణ, మంజునాథ్‌, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:19 AM