Share News

ప్రజల దరిచేరని కేంద్ర ప్రభుత్వ పథకాలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:48 PM

అనేక సంక్షేమపథకాల ద్వారా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాలకు అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రజలకు అందకపోవడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు.

ప్రజల దరిచేరని కేంద్ర ప్రభుత్వ పథకాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న సత్యకుమార్‌

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌

గోరంట్ల, ఫిబ్రవరి 11: అనేక సంక్షేమపథకాల ద్వారా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాలకు అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రజలకు అందకపోవడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. మండలంలోని పాలసముద్రం గ్రామంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ పార్టీ సంక్షేమపథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని నాలుగుకోట్ల మందికి ఇళ్లు నిర్మించగా, రాష్ట్రంలో 24లక్షల మందికి కేంద్రం ఇళ్లు నిర్మించిందన్నారు. ఆయుష్మాన భారత ద్వారా వైద్య చికిత్సల కోసం రూ.5లక్షలు చెల్లిస్తోందని, మూడేళ్లుగా ప్రజలకు ఉచిత రేషన ఇస్తూ, రాబోవు ఐదు సంవత్సరాల కోసం బియ్యం సరఫరాకు రూ.11లక్షల 45వేల కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నా, రైతులకు ఎందుకు అందడంలేదని ప్రశ్నించారు. మన ఓట్లతో గెలిచి ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రశ్నించడం అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమే్‌షరెడ్డి, అమర్‌దేవేంద్ర, హరీష్‌, బాలగోపాల్‌, మేదర శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, నజురుల్లా, నాగరాజుయాదవ్‌, ముంతాజమ్మ, లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 11:48 PM