TDP : అంబరాన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:54 PM
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బుధవారం హిందూపురంలో టీడీపీ నాయకు లు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. టపాసులు కాల్చి మిఠా యిలు పంచుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ‘నారా చంద్ర బాబు నాయుడు అనే నేను’ అన్న మాట వినడానికి ఐదేళ్లుగా ఎదురుచూశామ న్నారు.

హిందూపురం, జూన 12 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బుధవారం హిందూపురంలో టీడీపీ నాయకు లు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. టపాసులు కాల్చి మిఠా యిలు పంచుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ‘నారా చంద్ర బాబు నాయుడు అనే నేను’ అన్న మాట వినడానికి ఐదేళ్లుగా ఎదురుచూశామ న్నారు.
టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నాగ రాజు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారో త్సవం తిలకిం చేందుకు పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ సర్కిల్‌లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీనలు ఏర్పాటు చేశారు. టీఎనఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి, బాణసంచా కాల్చారు. రెండో వార్డులో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ కా లనీలోని శివా లయంలో పూజలు చేసి, 101కొబ్బరికాయలు కొట్టారు. మండలంలోని పల్లెల్లోనూ మిఠాయిలు పంచి పెట్టారు. వీరంపల్లిలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....