TDP : టీడీపీ నాయకుల సంబరాలు
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:00 AM
ఎమ్మెల్యే సవితకు మంత్రి పదవిలో శాఖలు కేటాయించడంతో ఆమె నివాసంలో టీడీపీ నాయకులు, ఆమె కు టుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సవితకు బీసీ సంక్షేమం హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖలు కేటాయించారు. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి సర్కిల్‌లో ఉన్న ఆమె నివాసంలో కేక్‌కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు.
పెనుకొండ టౌన, జూన 14 : ఎమ్మెల్యే సవితకు మంత్రి పదవిలో శాఖలు కేటాయించడంతో ఆమె నివాసంలో టీడీపీ నాయకులు, ఆమె కు టుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సవితకు బీసీ సంక్షేమం హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖలు కేటాయించారు. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి సర్కిల్‌లో ఉన్న ఆమె నివాసంలో కేక్‌కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ తదితర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ మండల మాజీ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాలనలో సవిత టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలిచి, దీటుగా ఎదుర్కొన్నారన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఏది ఏ మైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సవితను గుర్తించి మంత్రి పదవి ఇవ్వడం పెనుకొండ వాసుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో తురకలాపట్నం శ్రీనివాసులు, చంద్రకాంతమ్మ, అడ్వికేట్ విశ్వనాథ్, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరచౌదరి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....