Share News

పని చేయని సీసీ కెమెరాలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:29 PM

నగరంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో చోరీలకు అడ్డూ అదుపు లే కుండా పోతోంది. పోలీస్‌ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణం. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాలే పనిచే యడం లేదంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థమవుతుంది.

పని చేయని సీసీ కెమెరాలు
చెరువు కట్ట వద్ద ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాలు

అనంతపురం క్రైం, జనవరి 29: నగరంలో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో చోరీలకు అడ్డూ అదుపు లే కుండా పోతోంది. పోలీస్‌ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణం. తాడిపత్రి వైపు నుంచి అనంతపురం నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాలే పనిచే యడం లేదంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఆది వారం ఆ ప్రాంతంలో (చెరువుకట్ట ఎదుట) ఉంచిన బొలెరో వాహనం టైరు చోరీకి గురైంది. బాధితుడు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సీసీ కెమెరాల కంటోల్ర్‌ రూమ్‌ పోలీసులు చెప్పారు. ఆరు నెలల క్రితం అదే ప్రాంతంలో ఓ సుమో చోరీకి గురైంది. అప్పుడూ సీసీ కెమెరాలు పనిచే యకపోవడంతో ఆ వాహనం ఆచూకీ నేటికీ లభించలేదు. పాతూరు పరిధిలో సీసీ కెమె రాలు లేకపోవడం.. ఉన్నా అవి పనిచేయక పోవడం వాహనచోరులకు వరమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో సీసీ పుటేజీలు లేకపోవడంతో దొంగలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు ఏర్పాటు చేయని ప్రాంతాల్లో, స్థానిక వ్యాపారులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పోలీసులు పలు ప్రాం తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పనిచేయని వాటికి మరమ్మతులు చేయిం చాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:29 PM