Share News

తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:18 AM

పుట్టపర్తి రూరల్‌, జనవరి 31: తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా అందరం పనిచేయాలని డీఎంహెచఓ ఎస్వీ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన గాండ్లపెంట, కనగానిపల్లి, అమడగూరు, ముదిగుబ్బ, ఎనుమలపల్లి, పుట్టపర్తి, దర్శినమల, పెద్దమంతూరు, యనఎ్‌సగేట్‌ పీహెచసీల మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బందితో మాతృశిశుమరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలి

- డీఎంహెచఓ డాక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి

పుట్టపర్తి రూరల్‌, జనవరి 31: తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయంగా అందరం పనిచేయాలని డీఎంహెచఓ ఎస్వీ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన గాండ్లపెంట, కనగానిపల్లి, అమడగూరు, ముదిగుబ్బ, ఎనుమలపల్లి, పుట్టపర్తి, దర్శినమల, పెద్దమంతూరు, యనఎ్‌సగేట్‌ పీహెచసీల మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బందితో మాతృశిశుమరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నవంబరు, డిసెంబరు నెలలకు సంబందించి 9 సెంటర్లలో ఒక మాతృమరణం, 12 శిశుమరణాలు 12 సంభవించాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్‌ కృష్ణయ్య, డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్‌ వెంకటేష్‌, వైద్యురాలు పావని, డీపీహెచఎనఓ వీర మ్మ, సీడీపీఓ గాయత్రి, సంబందిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:18 AM