Share News

Carden Search: ప్రశాంత వాతావరణం కోసమే కార్డెన సెర్చ్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:15 AM

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా కార్డెన సెర్చ్‌ నిర్వహించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. బుడగ జంగాల కాలనీలో అనుమానితుల ఇళ్లలో పో లీసులు సోదాలు చేశారు.

Carden Search: ప్రశాంత వాతావరణం కోసమే కార్డెన సెర్చ్‌
Police talking to people

గుత్తి, మే 24: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా కార్డెన సెర్చ్‌ నిర్వహించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. బుడగ జంగాల కాలనీలో అనుమానితుల ఇళ్లలో పో లీసులు సోదాలు చేశారు. అనంతరం రికార్డులు లేని 6బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ స్టేషనలో ద్విచక్రవాహనాలకు సంబంధించి రికార్డుల ఆధారంగా వాటి నెంబర్ల ప్లేట్‌లను తయారు చేయించి మూడు బైక్‌లను అప్పగించినట్లు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు.

కణేకల్లు: మండలంలోని హనుమాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన సెర్చ్‌ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామం హనుమాపురంలో రౌడీషీటర్లు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలలో సోదాలు చేశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి గొడవలు, అల్లర్ల జోలికి పోకుండా ఉండాలని హెచ్చరించారు. రాయదుర్గం అర్బన సీఐ శ్రీనివాసులు, కణేకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కుందుర్పి: ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా జూన 6వ తేదీ వరకు 144 సెక్షన, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో వుంటుందని పోలీసులు తెలిపారు. మండలంలోని తహసీల్దార్‌ బి హనుమంతు, సబ్‌ ఇన్సపెక్టర్‌ వెంకట స్వామి ఆధ్వర్యంలో పలు దుకాణాలలో తనిఖీ నిర్వహించారు. చట్టాన్ని ఎవరైనా ధిక్కరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ తహసీల్దార్‌ హెచ్చరించారు.

Updated Date - May 25 , 2024 | 12:15 AM