Share News

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:45 PM

పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, సంస్కతం పేపర్‌ -1 పరీక్షలు నిర్వహించారు

ప్రశాంతంగా  ‘పది’ పరీక్షలు
పురం ఎంజీఎం పాఠశాల వద్ద వేచివున్న విద్యార్థులు

పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, సంస్కతం పేపర్‌ -1 పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకే విద్యార్థులు ఆయా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల్లోకి పంపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు సంబంధించి సంబంధిత అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

హిందూపురం అర్బన, మార్చి 18: పట్టణంలోని కేంద్రాల్లో సోమవారం మొదటిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎటువం టి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖాధికారులు తెలి పారు. అయితే ఎంజీఎం పాఠశాల బీ బ్లాక్‌లోని ఓ గదిలో ఫ్యాను తిరగలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా హిందూపురం లో ని 15 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 3217 మంది ప రీక్ష లు రాయాల్సి ఉండగా 3063 మంది హాజరయ్యారు. 154 మంది గైరారయ్యారు.

పెనుకొండ : పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు పేపర్‌ -1 పరీక్షకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 196మందికిగాను నలుగురు గైర్హాజరయ్యారు. అలాగే బాలికల ఉన్న త పాఠశాల ఏ- కేంద్రంలో 215 మందికిగాను ఏడుగురు, బీ - కేంద్రంలో 176 కుగాను 11మంది గైర్హాజరయ్యారు.

గోరంట్ల: పదో తరగతి విద్యార్థులకు గోరంట్లలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించి న తెలుగు పరీక్షకు 46మంది గైర్హాజరైనట్లు ఎంఈఓలు గోపాల్‌, జానరెడ్డెప్ప తెలి పారు. మొత్తం 1,116మందికిగాను 1,070 మంది పరీక్షలు రాశారు. శ్రీవివేకానంద పాఠశాలలో 230మందికిగాను 223మంది, శ్రీచైతన్య ఏ - కేంద్రంలో 197 మం దికిగా ను 188మంది, బీ - కేంద్రంలో 127మందికి గాను 122మంది హాజరయ్యారు. న్యూ మాంటిస్సోరిలో 249మందికిగాను 233మం ది, ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో 195కుగాను 186మంది హాజరయ్యారు. బాలికల ఉన్నతపాఠ శాలలో 118మందికిగాను అందరూ పరీక్షలు రాశారు. శ్రీచైతన్య పాఠ శాల, న్యూ మాంటిస్సోరిలో పరీక్షా కేంద్రాలను తహసీల్దార్‌ అక్బల్‌ బాషా తనిఖీ చేశారు.

రొద్దం: మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఏ, బీ - కేంద్రాలు , కేజీబీవీలో సీ - కేంద్రంలో పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏ - కేంద్రం 230మందికిగాను 222మంది, బీ - కేంద్రంలో 221కి 211 హాజర య్యారు. సీ- కేంద్రంలో 138కిగాను 128మంది హాజరయ్యారు. మొత్తం 28 మంది గైర్హాజరైనట్లు విద్యాశాఖాధి కారులు తెలిపారు.

చిలమత్తూరు: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 504 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటి రోజు 486 మంది హాజరయ్యారు. స్థానిక ఎస్‌ఎస్‌వైవిఎన ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏ - కేంద్రంలో 268 మందికిగాను 255 మంది హాజరయ్యారు. బీ - కేంద్రంలో 236 మందికి గాను 231 మంది హాజరయ్యారు. మొత్తంగా 18 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

లేపాక్షి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఓరియంటల్‌ పాఠశాల జూనియర్‌కళాశాల, మహాత్మజ్యోతిరావు పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రాల ను నిర్వహించారు. మండల వ్యాప్తంగా 797మంది విద్యార్థులు పరీక్షలురాయాల్సి ఉండగా 737మంది హాజరయ్యారు. 60మంది గైర్హాజరైనట్లు ఎంఈఓ నాగరాజు నాయక్‌ తెలిపారు.

మడకశిరటౌన: పట్టణం, మండలంలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1316 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1240 మంది హాజరయ్యారు. 76 మంది గైర్హాజరయ్యారు. మొట్టమొదటి సారిగా ఆమిదాల గొంది ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సెయింట్‌ ఆన్సలో రెండు కేంద్రాలు, సిద్ధార్థ విద్యానికేతన ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల, ప్రభు త్వ జూనియర్‌, ఒకేషనల్‌, ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత పాఠశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గుడిబండ: మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో 640 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా 621మంది హాజరైనట్లు ఎంఈఓలు గంగప్ప, రవిచంద్ర కుమార్‌ తెలిపారు. పాఠశాలలోని ఏ - కేంద్రంలో 250మందికి గాను ఆరుగురు, బీ - కేంద్రంలో 250మందికిగాను ఎనిమిది మంది, సీ- కేంద్రంలో 140మందికి గాను ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్‌ఐ మునిప్రతాప్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 11:45 PM