Share News

రూ.10కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రతిపాదన

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:50 PM

నగర పంచాయతీకి సంబం ధించి 2024-25సంవ త్సరానికిగాను రూ. 10,13,38,950 నిధుల అంచనాతో కౌన్సిల్‌ స మావేశంలో బడ్జెట్‌ ను ప్రతిపాదించారు.

రూ.10కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రతిపాదన
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టిన కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌

పెనుకొండ, మార్చి 12 : నగర పంచాయతీకి సంబం ధించి 2024-25సంవ త్సరానికిగాను రూ. 10,13,38,950 నిధుల అంచనాతో కౌన్సిల్‌ స మావేశంలో బడ్జెట్‌ ను ప్రతిపాదించారు. స్థానిక నగర పంచా యతీ కార్యాలయంలో మంగళవా రం చైర్మన ఉమర్‌ఫారూక్‌ అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా రూ.10కోట్ల నిధులతో అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ప్రతిపాదిం చారు. ప్రారంభ నిలువ రూ.8,98,17,550 కాగా సాధారణ రాబడి రూ.3.41 కోట్లు, మూలధనం రాబడులు రూ.10,75,10,000. ఈ మేరకు మొత్తం రాబడులు రూ.23,14,28,550. సాధారణ ఖర్చు రూ.3,10,84,000 కాగా మూలధన ఖర్చులు రూ.9,90,05,600, మొత్తం ఖర్చులు రూ.13,00,89,600. మొత్తం మిగులు 10,13,38,900తో అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ్యుడు రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... పట్టణంలో తాగునీటి సమస్య తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో పట్టణంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. అలాగే రోడ్లకు ఇరువైపులా పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి బంకులు ఏర్పాటు చేయడంతో రోడ్లు కుంచించుకు పోయాయన్నారు. వీటికితోడు ద్విచక్రవాహనాలను రోడ్లపైనే ఎక్కడికక్కడ నిలుపుతుండడంతో వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. అందుకు కమిషనర్‌ వంశీకృష్ణ సమాధానం ఇస్తూ పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తామన్నారు. వేసవికాలం కావడంతో బోర్లలో నీటి మట్టం తగ్గిపోతున్నాయని తెలిపారు. పరిస్థితిని గుర్తించి ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మనలు సునీల్‌కుమార్‌, నందినిరెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, భాస్కర్‌నాయక్‌, మేనేజర్‌ నరసింహులు, ఆర్‌ఓ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:50 PM