Share News

Bring the issues సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:44 AM

తమ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కేజీబీవీ పాఠశాల ఉద్యోగులు జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డికి విన్నవించారు.

Bring the issues   సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

- జనసేన నేత చిలకం మధుకు కేజీబీవీ ఉద్యోగుల వినతి

ధర్మవరం, జూన 16: తమ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కేజీబీవీ పాఠశాల ఉద్యోగులు జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డికి విన్నవించారు.


పట్టణంలోని కస్తూర్బాగాంధీబాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు శంకరమ్మ, గీత, సువర్ణ, లక్ష్మీ తదితరులు స్థానిక జనసేన కార్యాలయంలో ఆదివారం చిలకం మధుసూదనరెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో 4,579 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం జరిగేలా చూడాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిలకంను కోరారు. స్పందించిన ఆయన సమస్యలను డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 17 , 2024 | 12:44 AM