Share News

‘అంధుల జీవితాల్లో వెలుగునింపిన బ్రెయిలీ’

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:17 AM

అంధుల జీవితాలకు వెలుగునిచ్చిన సూర్యుడు బ్రెయిలీ అని ఎంఈఓ గంగప్ప పేర్కొన్నారు.

‘అంధుల జీవితాల్లో వెలుగునింపిన బ్రెయిలీ’
పురంలో అంధ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యం

హిందూపురం అర్బన, జనవరి 4: అంధుల జీవితాలకు వెలుగునిచ్చిన సూర్యుడు బ్రెయిలీ అని ఎంఈఓ గంగప్ప పేర్కొన్నారు. ప్ర పంచ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక భవి త కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్రెయిలీ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పట్టణంలోని వీవర్స్‌కాలనీలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యయుడు నాగార్జున, మౌలానా ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురా లు రిజ్వానాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ-2 ప్రసన్నలక్ష్మి, ఐఈఆర్‌పీలు లలిత, నందిని, అతిథులుగా బైసాని రాంప్రసాద్‌, గిరీష్‌, హెచఎం సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

పెనుకొండ: లూయీ బ్రెయిలీ జయంతి వేడుకలను స్థానిక భవితా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు చంద్రశేఖర్‌, సుధాకర్‌ మాట్లాడు తూ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి అంధుల జీవతంలో వెలుగులు నింపారన్నారు. కార్యక్రమంలో హెచఎం రాధామ ణి, ఫిజియో థెరపిస్టు అనిల్‌కుమార్‌, అక్కమ్మ, వెంకటరామరెడ్డి, వలీబా తదితరులు ఉన్నారు. అలాగే స్థానిక పరిటాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎనఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ కేశవరావు మాట్లాడుతూ లిపిని కనుక్కోవడం ద్వారా లూయీ బ్రెయిలీ విద్యాదాతగా నిలిచారన్నారు. ఫ్రాన్సలో జన్మించిన బెయిలీ జయంతిని ప్రతి యేడాది జనవరి 4న నిర్వహిస్తారన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:17 AM