BRAHMINS MEETING: బ్రాహ్మణ కార్పొరేషనను పునరుద్ధరించాలి
ABN , Publish Date - Jul 07 , 2024 | 11:37 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన బ్రాహ్మణ కార్పొరేషనను పునరుద్ధరించాలని బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ కల్యాణమండపంలో ఐక్యవేదిక నాయకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, జూలై 7: వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన బ్రాహ్మణ కార్పొరేషనను పునరుద్ధరించాలని బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ కల్యాణమండపంలో ఐక్యవేదిక నాయకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక నాయకుడు బత్తలపల్లి సత్యరంగారావు మాట్లాడుతూ రాజకీయ నాయకులు బ్రాహ్మణులను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకోవడంతోపాటు వారి మేథస్సును తమ స్వార్థాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషనను ఏర్పాటుచేసి సంక్షేమానికి పెద్దపీట వేసిందని, తర్వాత వైసీపీ ప్రభుత్వం కార్పొరేషనను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఇకనైనా కార్పొరేషనను పునరుద్ధరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులంతా ఐక్యత చాటుకోవాలన్నారు. విశ్రాంత డీఎస్పీలు గిరికుమార్, లక్ష్మయ్య, ఏఎల్‌ఎన శాసి్త్ర, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, బద్రీనాథ్, నార్పల మారుతి, సత్యప్రసాద్ పాల్గొన్నారు.