Share News

DIG : సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ

ABN , Publish Date - May 12 , 2024 | 12:29 AM

మండలంలోని కమ్మలవాండ్లపల్లి వద్ద కర్ణాటక సరిహద్దులోని చెక్‌ పోస్టును స్థానిక డీఐజీ, ఎన్నికల పరిశీలకుల ఇమ్‌నా లెన్సా శనివారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక నుంచి మద్యం, నగదు, ఇతర బహుమతి వస్తువులు రవాణాకాకుండా చర్యలు చేపట్టాలని సి బ్బందిని ఆదేశించారు.

DIG : సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ
DIG Imna Lensa inspecting the Kammalavandlapally check post

గోరంట్ల, మే 11: మండలంలోని కమ్మలవాండ్లపల్లి వద్ద కర్ణాటక సరిహద్దులోని చెక్‌ పోస్టును స్థానిక డీఐజీ, ఎన్నికల పరిశీలకుల ఇమ్‌నా లెన్సా శనివారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక నుంచి మద్యం, నగదు, ఇతర బహుమతి వస్తువులు రవాణాకాకుండా చర్యలు చేపట్టాలని సి బ్బందిని ఆదేశించారు. అనంతరం సమస్యాత్మక గ్రామా లైన కమ్మలవాండ్లపల్లి, వెంకటరమణపల్లి, పోలింగ్‌ కేం ద్రాలను సందర్శించారు. ఎన్నికల పోలింగ్‌ విధులకోసం మండలానికి కేటాయించిన సీఆర్‌పీఎఫ్‌ దళాలతో సమావేశం నిర్వహించారు. ప్రశాంత పోలింగ్‌కు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయనతోపాటు సీఐ సుబ్బరాయుడు ఉన్నారు.


పోలింగ్‌కు సర్వం సిద్ధం

మడకశిర టౌన: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6గంటలకు తెరపడింది. ఎన్నికల అధికారు లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7గంటల నుంచి జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మడకశిర నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 241పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవ ర్గంలో 2,11,074 మంది తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. అందులో పురుషులు 1.62లక్షల మంది, మహిళా ఓట ర్లు 1.48లక్షల మంది ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికారుల ఆదేశాలతో ఇప్పటికే నియోజక వర్గంలోని అన్ని దుకా ణాలు మూసివేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 450 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించినట్లు సీఐ మనోహర్‌ తెలిపారు. వారికి శనివవారం మడకశిర సర్కిల్‌ కార్యాలయంలో ఎన్నికల నియమా వళిపై సీఐ సూచనలు ఇచ్చారు. అనంతరం మడకశిర పట్టణంలో కవాతు నిర్వహించారు. మడకశిర నియోజకవర్గ ప్రాంత వాసులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరూ నియోజకవర్గంలో ఉండరాదని సీఐ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 12:29 AM