Share News

Book reading పుస్తక పఠనం అలవాటు చేయాలి

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:35 AM

తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివేది అలవాటు చేయాలని మాజీ సర్పంచ హరినాథ్‌చౌదరి సూ చించారు. మండలకేంద్రంలోని గ్రంథాలంయంలో శుక్రవారం వేసవి శిక్ష ణ తరగతులు ముగింపు కార్యక్రమాన్ని గ్రంఽథాలయాధికారి జయరాం నిర్వహించారు.

  Book reading పుస్తక పఠనం అలవాటు చేయాలి

కొత్తచెరువు, జూన 7: తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివేది అలవాటు చేయాలని మాజీ సర్పంచ హరినాథ్‌చౌదరి సూ చించారు. మండలకేంద్రంలోని గ్రంథాలంయంలో శుక్రవారం వేసవి శిక్ష ణ తరగతులు ముగింపు కార్యక్రమాన్ని గ్రంఽథాలయాధికారి జయరాం నిర్వహించారు.


మాజీ సర్పంచ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. పుస్తకపఠనం వల్ల విజ్ఞానంతో పాటు తెలివితేటలు పెంపొందించుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివేది అలవాటు చేయాలన్నారు. అనంతరం ఇంతకుమునుపు నిర్వహించిన పలు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 08 , 2024 | 12:35 AM