Bonals త్రిపుర సుందరీ దేవికి బోనాలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:49 PM
పట్టణంలోని నాగప్పకాలనీలో గల త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి ఆదివారం బోనా లు సమర్పించారు. ప్రధాన అర్చకుడు రామస్వామి ఉదయమే ఆలయంలోని అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుంతకల్లుటౌన, జూలై 28: పట్టణంలోని నాగప్పకాలనీలో గల త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి ఆదివారం బోనా లు సమర్పించారు. ప్రధాన అర్చకుడు రామస్వామి ఉదయమే ఆలయంలోని అమ్మవారికి అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు బోనాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, నీలకంఠ, సత్యనారాయణ, రమే్‌షబాబు, రవికుమార్, వెంకటేశులు, భాస్కర్, శివస్వామి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..