Share News

చేతి వృత్తులకు బీజేపీ పెద్దపీట

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:08 AM

భారతకు ఆత్మ నిర్బర్‌ ఒక చిహ్నం లాంటిదని ఖాదీ, గ్రామ పరిశ్రమల ఉ త్పత్తుల కార్పొరేషన జాతీయ చైర్మన మ నోజ్‌కుమార్‌ అ న్నారు.

చేతి వృత్తులకు బీజేపీ పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న కేవీఐసీ చైర్మన

కేవీఐసీ చైర్మన మనోజ్‌కుమార్‌

హిందూపురం, మార్చి 8 : భారతకు ఆత్మ నిర్బర్‌ ఒక చిహ్నం లాంటిదని ఖాదీ, గ్రామ పరిశ్రమల ఉ త్పత్తుల కార్పొరేషన జాతీయ చైర్మన మ నోజ్‌కుమార్‌ అ న్నారు. ఆయన శుక్ర వా రం హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానం లో చేతి వృత్తిదారులకు అధునాతన పరికరాలు అందించారు. ఇవి ఆత్మనిర్బర్‌ భారత అబియాన కింద అందించినట్లు తెలిపారు. చేతి వృత్తులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కరోనా సమయంలో ఆత్మనిర్బర్‌ భారత అభియాన తీసుకొచ్చి రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక, ఆర్థిక సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరులు, తేనేటీగల పెంపకందారులకు, పేపర్‌ కుటీ పరిశ్రమ లవారికి, చింతపండు రైతులకు, ఉచితంగా పరికరాలు అందజేశారు. వీరికి ఇప్ప టికే శిక్షణ ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కేవీఐసీ చైర్మన మనోజ్‌కుమార్‌ హాజరై మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా చేతి వృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆధునిక పనిముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైల్వే ఫంక్షనహాల్‌లో ఏర్పాటు చేసిన ఖాదీ దుస్తుల స్టాల్స్‌ను మనోజ్‌కుమార్‌ రిబ్బన కట్‌చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కేవీఐసీ కమిషనకు సంబంధించి సౌతజోన డిప్యూటీ సీఈఓ మదనకుమార్‌రెడ్డి, బాంబే జోన నల్లముత్తు, స్థానిక బీజేపీ నాయకులు రమణమూర్తి, రమేష్‌రెడ్డి, ఆదర్శ్‌, నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:08 AM