Share News

వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:44 PM

ఎండలు ఎక్కువగా ఉన్నాయని, బయట తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి ఈ.బీ. దేవి ప్రజలకు సూచించారు.

వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండండి
వడదెబ్బపై కొర్రపాడులో అవగాహన కల్పిస్తున్న డీఎంహెచఓ

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 6: ఎండలు ఎక్కువగా ఉన్నాయని, బయట తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి ఈ.బీ. దేవి ప్రజలకు సూచించారు. శనివారం ఆమె తన చాంబర్‌లో మాట్లాడుతూ... వడదెబ్బపై బీకేఎస్‌ మండలం కొర్రపాడు పీహెచసీలో అవగాహన కల్పించామన్నారు. వడదెబ్బ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వడదెబ్బ తగిలిన లక్షణాలు కల్పిస్తే వెంటనే నీడ ప్రాంతానికి వెళ్లి.. తడిగుడ్డతో తుడిచి ఉష్ణోగ్ర తను తగ్గించాలన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:44 PM