DIESEAS: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:15 AM
మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా గణాంక అధికారి మహ్మద్ రఫీ, మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ సూచించారు.
రాయదుర్గంరూరల్, జూన 22: మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా గణాంక అధికారి మహ్మద్ రఫీ, మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ సూచించారు. శనివారం రాయదుర్గం అర్బనలో వైద్యసిబ్బంది మలేరియా, డెంగీపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏఎ్‌సఓ లక్ష్మీనరసమ్మ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఉరవకొండ: మండల పరిధిలోని నెరమెట్ల గ్రామంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్యసిబ్బంది శనివారం అవగాహన కల్పించారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీహెచవో నాగరంగయ్య, హెల్త్‌ఎడ్యుకేటర్ షఫీ, సూపర్‌వైజర్ శేఖర్, వైద్యసిబ్బంది భగవాన దాస్, వెంకటేష్ పాల్గొన్నారు.
గుత్తి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సీజనల్ వ్యాధులపై తీసువాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా, డయేరియా తదితర వ్యాధులు ప్రబలకుండా అమినిటీ సెక్రటరీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.