బీసీల ద్రోహి జగన: గుండుమల
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:03 AM
ముఖ్యమంత్రి జగన బీసీల ద్రోహి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి మండిపడ్డారు. బీసీలపై కక్ష గట్టి, వారుఅభివృద్ధి చెందకుండా కుట్ర పూరితంగా అణచి వేస్తున్నారని అన్నారు.

మడకశిర టౌన, జనవరి 11: ముఖ్యమంత్రి జగన బీసీల ద్రోహి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి మండిపడ్డారు. బీసీలపై కక్ష గట్టి, వారుఅభివృద్ధి చెందకుండా కుట్ర పూరితంగా అణచి వేస్తున్నారని అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని టీడీపీ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి బా టలు వేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. టీడీపీకి బీసీలు అండగా ఉండ టాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి వారిపై కక్ష గట్టారన్నారు. బీసీలకు మొట్టమొదటి సారిగా రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అని, వాటి శాతం పెంచి పదవులను కట్టబెట్టింది చంద్రబాబు అన్నారు. కార్పొరే షనల ద్వారా సబ్సిడీ బుణాలు అందించి బీసీల ఆర్థికాభివృద్ధికి కృషిచేశార న్నారు. జగన సీఎం అయిన తరువాత కార్పొరేషనలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పైగా రిజర్వేషనలు తగ్గించి రాష్ట్రంలో 16,800మం ది బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు లేకుండా చేశారని విమర్శించారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌రావ్ బీసీ నేత కావడంతో ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే కలవ డానికి అవకాశం ఇచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలు ఏకమై జగనను గద్దె దించాలని అప్పుడే బీసీలకు భవిష్యత్తు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అత్మరక్షణ చట్టం ద్వారా బీసీలకు అండగా ఉంటారని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌మూర్తి, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్, మైనార్టి జిల్లా అధ్యక్షులు భక్తర్, పట్టణ అధ్యక్షులు మనోహర్, కన్వీనర్ లక్ష్మీనారాయణ. నాయకులు రవి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.