Share News

బీసీల ద్రోహి సీఎం జగన

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:23 AM

రాష్ట్రంలో బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే... అది ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డే అని టీడీపీ కూటమి అభ్యర్థి సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. అగళి మండల కేంద్రంలోని ఆర్కే కల్యాణ మండపంలో శుక్రవారం జయహో బీసీ సదస్సు నిర్వహించారు.

బీసీల ద్రోహి సీఎం జగన
జయహో బీసీ సదస్సులో మాట్లాడుతున్న సునీల్‌కుమార్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

అగళి, ఏప్రిల్‌ 5 : రాష్ట్రంలో బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే... అది ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డే అని టీడీపీ కూటమి అభ్యర్థి సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. అగళి మండల కేంద్రంలోని ఆర్కే కల్యాణ మండపంలో శుక్రవారం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సునీల్‌తో పాటు మాజీ ఎమ్మె ల్యే ఈరన్న రాష్ట్ర, కుంచిటిగ వక్కలిగ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు వీఎం పాండురంగప్ప హాజరయ్యారు. మండల కన్వీనర్‌ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థి సునీల్‌ మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు రక్షణ కరువైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి దిశగా తీసుకెళ్లారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు 34శాతం రిజర్వేషన కల్పిస్తే దానిని 24శాతానికి తగ్గించింది ఈ దరిద్రపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డే అన్నా రు. పాండురంగప్ప మాట్లాడుతూ.... టీడీపీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించారన్నారు. అనంతరం అగళి, ఎంఎం పా ళెం, రామాపురం, ఇరిగేపల్లి, నందరాజునపల్లి, గొల్లహట్టి గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, నాయకులు రామక్రిష్ణ యాదవ్‌, తిమ్మేగౌడ్‌, మాజీ ఎంపీపీలు, ఆదినారాయణ, అశ్వత్థరామప్ప, రామ క్రిష్ణ, రామాంజనేయులు, రంగనాథ్‌, కిష్టప్ప, నాగోజీ, చక్రప్ప, దినేష్‌, కేతప్ప, భీమ రాజ్‌, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:23 AM