Share News

టీడీపీతోనే బీసీలకు గుర్తింపు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:47 PM

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు చలవతోనే రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు వచ్చిందని, అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో బీసీలకు అన్ని విధాలా న్యాయం దక్కిందని పలు వురు నాయకులు పేర్కొన్నారు.

టీడీపీతోనే బీసీలకు గుర్తింపు
చిలమత్తూరులో మాట్లాడుతున్న టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అఽధ్యక్షుడు రంగయ్య

జయహో బీసీ సదస్సులో నాయకులు

చిలమత్తూరు, ఫిబ్రవరి 2: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు చలవతోనే రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు వచ్చిందని, అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో బీసీలకు అన్ని విధాలా న్యాయం దక్కిందని పలు వురు నాయకులు పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు లో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సభను నిర్వహించారు. టీడీపీ బీసీ సెల్‌ హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు కొడికొండ బాలాజీ అఽఽధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవన హళ్లి ఆనంద్‌, వడ్డెర సాధికారత రాష్ట్ర కన్వీనర్‌ వెంకట్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల్లుకుంట అంజనప్ప, రా మాం జనమ్మ, మాజీ కార్యదర్శి దేమకేతేపల్లి అంజనప్ప తదితరులు పాల్గొని ప్రసంగిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అణగారిన కులాలను సమాజం నుంచి బయటికి తీసి వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్యం కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు పయ నిస్తూ బీసీలే టీడీపీకి వెన్నెముక అనుకొని వారి కోసం అహర్నిశలు కష్టపడు తున్నారన్నారు.ప్రస్థుతం వైసీపీ పాలనలో బీసీలపై జరుగుతున్న దాడులు, రాజకీయ కంగా వారిని వాడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాల న్నారు. వైసీపీ నాయకులు కూడా బీసీ పదం వాడుతూ బీసీలను మఽభ్య పెట్టేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ పన్నాగాలను తిప్పుకొట్టాల న్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి బీసీ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుమహిళ రాష్ట్ర కార్యదర్శి పరిమళ, నాయకులు నందీశప్ప, రామప్ప, శ్రీదేవి, బేకరీ గంగాధర్‌, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, మీసేవ సూరి, రంగప్ప, నంజుండప్ప, లక్ష్మినరసప్ప, తిప్పారెడ్డి, జనసేన నాయకులు రమణ, ప్రవీణ్‌, అగ్గిశీన తదితరలు పాల్గొన్నారు.

లేపాక్షి: తెలుగుదేశం పార్టీ అదిష్టానం పిలుపుమేరకు శుక్రవారం లేపాక్షిలో జయహో బీసీ కార్యక్రమాన్ని మండల కన్వీనర్‌ జయప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య హాజరయ్యారు. మండల వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు హాజరై జయ హో బీసీ అంటూ నినాదాలు చేశారు. నంది విగ్రహం నుంచి లేపాక్షి సబ్‌స్టేషన వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైక్‌ ర్యాలీలో తెలుగు తమ్ముళ్లు అఽధిక సంఖ్యలో పా ల్గొన్నారు. అనంతరం ఆర్‌జెహెచ ఫంక్షనహాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ్ట్రబీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుంటుమద్ది రంగయ్య మాట్లాడుతూ... బీసీలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి అణగదొక్కేందుకు చాలా ప్రయత్నాలు చేసిందన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ఏకతాటిపై నడవాలన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:47 PM