Share News

bank: బ్యాంకర్లు చిత్తశుద్ధితో పేదలకు సేవలందించాలి

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:05 AM

బ్యాంకర్లు చిత్తశుద్ధితో పేదలకు సేవలందించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్తు ఆవరణలో ఉన్న డీపీఆర్‌సీ భవనంలో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన రుణం సకాలంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు.

bank: బ్యాంకర్లు చిత్తశుద్ధితో పేదలకు సేవలందించాలి
Collector Vinod Kumar speaking in the meeting

- జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

- అర్హులందరికీ విరివిగా రుణాలు అందజేయాలి: ఎంపీ అంబికా

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 20: బ్యాంకర్లు చిత్తశుద్ధితో పేదలకు సేవలందించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్తు ఆవరణలో ఉన్న డీపీఆర్‌సీ భవనంలో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన రుణం సకాలంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు. కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. బ్యాంకర్లు బాధ్యతగా పని చేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలన్నారు.


బ్యాంకర్లు ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేకుండా సమావేశాలకు రావడం అలసత్వానికి నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు విరివిగా రుణాలు అందజేయాలన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయలోపంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గం కేంద్రంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నాబార్డు అధికారులు ఉన్నారా లేదా అనే అనుమానం వస్తోందని, పథకాలను అర్హులకు అందజేయడంలో సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ అందించిన సహకారం, సమగ్ర నివేదికతో జిల్లా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించామని, భవిష్యత్తులో మరింత నిధులు తీసుకురావడానికి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో ఎల్‌డీఎం నర్సింగరావు, లీడ్‌ జిల్లా అధికారి గిరిధర్‌, జడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ పీడీ ఓబుళమ్మ, పశుసంవర్థకశాఖ జేడీ సుబ్రహ్మణ్యం, డీఈఓ వరలక్ష్మి, హార్టికల్చర్‌ డీడీ నరసింహారావు, హ్యాండ్‌లూమ్‌ ఏడీ అప్పాజీరావు, డీఐసీ జీఎం నాగరాజురావు, నాబార్డు డీడీఎం అనురాధా, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ సురేఖరాణి, ఫిషరీస్‌ డీడీ శ్రీనివాసనాయక్‌, వివిధ బ్యాంకుల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:05 AM