BALLAYYA: మీ ఆస్తులకు బాలయ్య రక్షణ
ABN , Publish Date - May 03 , 2024 | 01:29 AM
నందమూరి బాలకృష్ణను మూడోసారి గెలిపించుకుని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని నందమూరి వసుంధరా దేవి అన్నారు. ఆమె గురువారం స్థానిక మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందిపడ్డ విష యం తెలిసిందే. అలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే సైకిల్‌కు ఓటేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ ఎంతో కృషిచేశారన్నారు.
టీడీపీ గెలిస్తే మీ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు: వసుంధరాదేవి
హిందూపురం, మే 2: నందమూరి బాలకృష్ణను మూడోసారి గెలిపించుకుని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని నందమూరి వసుంధరా దేవి అన్నారు. ఆమె గురువారం స్థానిక మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందిపడ్డ విష యం తెలిసిందే. అలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే సైకిల్‌కు ఓటేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ ఎంతో కృషిచేశారన్నారు.
దశాబ్దాలకాలంగా ఉన్న నీటి సమస్య పరిష్కరిం చింది టీడీపీయే అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేనేతలకు పెద్దపీట వేశారన్నారు. మరమగ్గాలకు విద్యుతపై రాయితీ ప్రకటించారన్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్నవారు, నిజాయితీగా ఓటేసి వారు ఈ ప్రాంతంలో ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేనేత వస్ర్తాలకు ప్రత్యేక గుర్తింపు తెస్తారని హామీ ఇచ్చారు. ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాలు తెలుగుదేశంపార్టీకి కంచుకోటలాంటివన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వనసైడ్‌గా టీడీపీకి పట్టం కడుతున్నారన్నారు.
ఈ ఎన్నికల్లో మరింత మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు. చేనేతలకు ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. హిందూపురం పట్టణ అభివృద్ధి వేగంగా జరగాలంటే బాలకృష్ణతోనే సాధ్యమన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. మేనిఫెస్టోపై ఓటర్లకు వివరిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్‌పర్సన రా విళ్లలక్ష్మి, టీడీపీ నాయకులు బండా రుబాలాజీ, మారుతి, పల్లా కుమార్, ఏసీ నాగరాజు, కోరుముట్ల నాగేంద్ర, హరి, బా బు, ఆదిమూర్తి, శ్రీనివాస రెడ్డి, అమీన, నెట్టప్ప, వెంక టేశ, చం ద్రమోహన, హమీద్, నజీర్, బాబాఫకృద్దీన, డీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....