నటనలో ఆయనకాయనే సాటి
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:59 PM
నందమూరి బాలకృష్ణ నటన అద్భుతమనీ, ఆయనకు ఆయనే సాటి అంటూ టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ుహిందూపురం, ఆగస్టు 30: నందమూరి బాలకృష్ణ నటన అద్భుతమనీ, ఆయనకు ఆయనే సాటి అంటూ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆయన సినిమారంగంలో ప్రవేశించి శుక్రవారం నాటికి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ కేక్ కట్‌చేశారు. ఆర్‌ఎంఎస్ షఫీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలమత్తూరు మండలంలో టేకులోడు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీనియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర రంగంలో 50ఏళ్లు సుదీర్ఘంగా నటుడిగా కొనసాగుతున్న అరుదైన అవకాశం బాలకృష్ణకే దక్కిందన్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకెళ్తూ హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. టీడీపీ నాయకులు నాగరాజు, బేవనహళ్లి ఆనంద్, రామాంజినమ్మ, అమర్నాథ్, మోదాశివ, పరిమళ, ఎస్టీసెల్ వెంకటరమణ, రవీంద్రనాయుడు, కోరుముట్ల నాగేంద్ర, టైలర్ గంగాధర్, అమీన, హనుమంతరాయుడు, ఆదినారాయణ, సూరీ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పావగడ : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50ఏళ్ల సుదీర్ఘ సినీరంగ ప్రవేశ వేడుకలను, దివంగత పరిటాల రవి 67వ జయంతిని పావగడలో ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. శనీశ్వరుడి ఆలయం పక్కన పట్టణ ప్రజలకు అన్నదానం చేశారు. భవానీ ఎన్టీఆర్ తాళ్లూరు గోవిందప్ప, తరకారి కృష్టప్ప, సుబ్రమణి, కేఆర్ గంగాధర్, మాచినేని ప్రవీణ్, వెంకట్ రాము అనిల్ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు.