Share News

CAMPAIN: భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాల్సిందే

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:00 AM

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బోయరెడ్డిపల్లి, చింతలాయపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు.

CAMPAIN: భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాల్సిందే
ప్రచారంలో పాల్గొన్న అశ్మితరెడ్డి

యాడికి, ఏప్రిల్‌ 24: రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బోయరెడ్డిపల్లి, చింతలాయపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రచారంలో మండల కన్వీనర్‌ రుద్రమనాయుడు, నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి, వేలూరు రంగయ్య, పరిమి చరణ్‌, బయపురెడ్డి, రామకృష్ణ, పెద్దయ్య, నాగేశ్వర, రవికుమార్‌రెడ్డి, తిరంపురం నీలకంఠ, ఆదినారాయణ, నాగలింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


చిన్నపొలమడలో ప్రచారం

తాడిపత్రిటౌన: మండలంలోని చిన్నపొలమడలో బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నరేంద్రనాయుడు, ప్రసాద్‌, నాయుడు, రవి, కొండారెడ్డి, సుబ్బయ్య, నాగార్జున పాల్గొన్నారు.

పలువురు టీడీపీలో చేరిక: స్థానిక నివాసంలో బుధవారం పెద్దవడుగూరు మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ మద్ధతుదారులు జేసీ అశ్మితరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఓలయ్య, జయకృష్ణ, రవి, రాంమోహన, రాము ఉన్నారు.


జేసీపీఆర్‌ పర్యటన: పట్టణంలోని విజయనగర్‌కాలనీలో బుధవారం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. మల్లికార్జునరెడ్డి, పవనకుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, సో మశేఖర్‌నాయుడు, చిం బిలి ప్రసాద్‌నాయుడు విజ్జి, సుదర్శనరెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:00 AM