అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:50 AM
ధర్మవరం, జనవరి 11: అయోధ్య రాముడి అక్షింతలను పట్టణంలోని యాదవవీధిలో గురువారం విశ్వహిందూపరిషత నాయకులు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.

ధర్మవరం, జనవరి 11: అయోధ్య రాముడి అక్షింతలను పట్టణంలోని యాదవవీధిలో గురువారం విశ్వహిందూపరిషత నాయకులు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అయోధ్యలో ఈనెల 22వ తేదీన రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని, ఆ రోజున ప్రతిఒక్కరూ ఇంటి ముంగిట దీపాలు వెలిగించి అక్షింతలను తలపై జల్లుకోవాలని సూచించారు. అలాగే డీఎస్పీశ్రీనివాసులు అక్షింతలు అందజేశారు. కార్యక్రమంలో జరుగుతుందని కోన కణ్వాశ్రమం స్వామీజీ, విశ్వహిందూపరిషత జిల్లాఅధ్యక్షులు పులిచెర్ల వేణుగోపాల్, ఆర్‌ఎ్‌సఎస్ అఖండ కార్యనిర్వాహకుడు అన్నం అరవిందు, సభ్యులు డిష్‌రాజు, రాప్తాటిరాము, దూలెప్ప, కృష్ణ, వెంగముని, బోడగల గిరిధర్, బొల్లినేని నారాయణ, నాగరాజు, నిరంజనకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.