Share News

అందరికీ అందుబాటులో ఉంటా

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:50 PM

‘ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటా’ అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి సవిత పేర్కొన్నారు.

అందరికీ అందుబాటులో ఉంటా
సమావేశంలో మాట్లాడుతున్న సవిత

టీడీపీ పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, ఫిబ్రవరి 25: ‘ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటా’ అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి సవిత పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలకు చెందిన టీడీపీ నాయకులు పెద్దఎత్తున ఆమెను కలిసేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉందన్నారు. కావున టీడీపీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని, వైసీపీ అరాచకాలను ఆయా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరో రెండు రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేసుకుని మారుమూల ప్రాంతంలోని ప్రతి ఇంటి నుంచి పట్టణంలోని ప్రతివీధిల్లో తిరుగుతానన్నారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని తెలిపారు.

జనసైనికుల్లో నూతనోత్తేజం

పెనుకొండ టౌన : టీడీపీ, జనసేన పొత్తుతో అభ్యర్థులు ఖరారు చేయడంతో జనసేన కార్యకర్తల్లో నూతనుత్తేజం నెలకొందని జనసేన పట్టణ అధ్యక్షుడు లోకేష్‌ అన్నారు. పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా కురుబ సవితను ఎంపిక చేయడంతో ఆదివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో ఆమెను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పూలమాలలతో సన్మానించారు. అనంతరం జనసే న నాయకులు మాట్లాడుతూ... టీడీపీ అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న జనసేన సైనికులు కలిసికట్టుగా పనిచేసి ఆమె విజయా నికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పరిగి మం డల కన్వీనర్‌ సురేష్‌, నాయకులు సుబ్రహ్మణ్యం, జుబేర్‌, వీరమహిళ శ్రీదేవి, బాబా ఫకృద్దీన, రమేష్‌, పూలనరేంద్ర, అశోక్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కురుబ కులానికే తలమానికం సవిత

పెనుకొండ టౌన : కురుబ కులానికే టీడీపీ అభ్యర్థి సవిత తలమానికం అని కురుబ నాయకులు కొనియాడారు. కురుబ కులస్థులు ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కుమార్తె సవిత కురుబ సమావే శాలు, విగ్రహాల ఏర్పాటు లాంటివి పెద్దఎత్తున చేపట్టారని, తండ్రి పేరుతో ఏర్పా టుచేసిన ట్రస్ట్‌ ద్వారా కులమతాలు తారతమ్యం లేకుండా ఎన్నో సేవా కార్యక్ర మాలు చేపట్టారని కొనియాడారు. ఏది ఏమైనా కురుబ కులస్థులంతా ఆమెకు అండగా ఉండటమేకాక, ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:50 PM