Share News

అట్టహాసంగా పల్లె సింధూర నామినేషన

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:32 AM

పుట్టపర్తి, ఏప్రిల్‌ 18: జిల్లాకేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదటిరోజు గురువారం సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.

అట్టహాసంగా పల్లె సింధూర నామినేషన

- భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు

పుట్టపర్తి, ఏప్రిల్‌ 18: జిల్లాకేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదటిరోజు గురువారం సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. దశమి మంచిరోజు కావడంతో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డితో పాటు ఆమె భర్త పల్లె వెంకట క్రిష్ణకిశోర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి నామినేషన్లు వేశారు. ఉదయం 9:30 గంటలకు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పల్లె కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పార్థసార ధి, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి గణే్‌షకూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శుభముహూర్తం చూసుకుని పల్లె సింధూరరెడ్డితో పాటు వారందరూ ఆర్‌ఓ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ సింధూరరెడ్డితో పాటు పల్లె రఘనాథరెడ్డి, పల్లె వెంకటకృష్ణకిశోర్‌రెడ్డి ఒక్కో సెట్‌ నామినేషన పత్రాలు ఆర్‌ఓ భాగ్యరేఖకు అందజేశారు. నామినేషన అనంతరం గణే్‌షకూడలి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్ధేశించి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. మరోమారు జగన ముఖ్యమంత్రి ఐతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. కనుక సైకో పాలనకు అంతం పలకాలన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటువేసి

కూటమిని గెలిపించాలని పిలుపినిచ్చారు. పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమితోనే సుపరిపాలన సాధ్యమన్నారు. ఎమ్మెల్యేగా పల్లె సింధూరను, ఎంపీగా తనను భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీనాయకులు మాజీమంత్రి నిమ్మల, సామకోటి ఆదినారాయణ, పీసీ గంగన్న, పత్తి చంద్రశేఖర్‌, అబ్దుల్‌, ఆదినారాయణరెడ్డి, శ్రీరామిరెడ్డి, రామాంజనేయులు, విజయ్‌కుమార్‌, రామలక్ష్మణ్‌ సోదరులు, శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్‌తో పాటు ఆరుమండలాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:32 AM