Share News

దాడి హేయమైన చర్య

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:53 PM

ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్యఅని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఫొటో గ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ జనసేన పార్టీ నాయకులు చిన్న ప్రవీణ్‌, ఏవీ రమణ, వెంకట శివ, లక్ష్మణమూర్తి, హరి, జయచంద్ర, రంగనాథ్‌ తదితరులు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

దాడి హేయమైన చర్య
తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందిస్తున్న జనసేన నాయకులు

జనసేన నాయకులు.. నిందితులను శిక్షించాలని వినతి

చిలమత్తూరు, ఫిబ్రవరి 20: ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్యఅని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఫొటో గ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ జనసేన పార్టీ నాయకులు చిన్న ప్రవీణ్‌, ఏవీ రమణ, వెంకట శివ, లక్ష్మణమూర్తి, హరి, జయచంద్ర, రంగనాథ్‌ తదితరులు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందన్నారు. ఈ ప్రభు త్వానికి నచ్చని వారిపై దాడులకు పూనుకుంటోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతో కాలం సాగవన్నారు. ఫొటోగ్రాఫర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

అగళి, ఫిబ్రవరి 20 : ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడి అమానుషమని, దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ ఉమేష్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడా రు. ప్రస్తుతం రాష్ట్రంలో విలువలతో కూడుకున్న రాజకీయాలు లేవన్నారు. రౌడీయిజం, గూండాయిజం ఉన్నవారే రాజకీయాలు చేయాలేమో అనిపి స్తోందన్నారు. వాస్తవాలను పత్రికల్లో ప్రచురించేందుకు వెళ్లిన వారిపై దాడిచే యాల్సిన అవసరం ఏముందన్నారు. ప్రజలందరూ ఇది గమనిస్తు న్నారన్నారు. మూడునెలలు దాటితే వైసీపీ మూలాన పడుతుందన్నారు. అప్పుడు వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలే చూస్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కుమారస్వామి, బీసీ సెల్‌ నాయకుడు తిప్పేస్వామి, నాయకులు శ్రీనివాసులు, శివకుమార్‌, రవికుమార్‌, కర్రెన్న, నాగరాజు, శివన్న, రామచంద్రారెడ్డి, శివలింగప్ప, నాగోజీ, దినేష్‌, రాజు, మంజునాథ్‌ తదితరులు ఉన్నారు.

గుడిబండ: ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు దాడిచేయడం అమానుషమని టీడీపీ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌ ఖండించారు. సిద్ధం సభకు కవరేజ్‌ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిచే యడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. దాడిచేసిన వారిని వెం టనే అరెస్ట్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 11:53 PM