Share News

ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:05 AM

రాష్ట్ర ప్రభు త్వం ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీ యూసీ సంఘం జిల్లా కా ర్యదర్శి రాజారెడ్డి, నాయ కులు డీఎంహెచఓ ఈ.బీ. దేవికి ఆమె కార్యాల యం లో మంగళవారం వినతి ప త్రం అందజేశారు

ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
డీఎంహెచఓకు వినతిపత్రం ఇస్తున్న నేతలు

అనంతపురం విద్య, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభు త్వం ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీ యూసీ సంఘం జిల్లా కా ర్యదర్శి రాజారెడ్డి, నాయ కులు డీఎంహెచఓ ఈ.బీ. దేవికి ఆమె కార్యాల యం లో మంగళవారం వినతి ప త్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని రాజారెడ్డి మండిపడ్డారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు కూడా చేయిస్తున్నారని, అధికారుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. ఒక వైపు రాజకీయ వేధింపులు, మరో వైపు అధికారులు ఆనలైనలో వివరాల నమోదు, రికార్డులు ఇలా అనేక పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వారిపై పనిభారం తగ్గించాలని కోరారు. జిల్లాలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన టీబీ, లెప్రసీ బకాయిలు చెల్లించాలన్నారు. వర్కర్లకు నాణ్యమైన యూనిఫామ్స్‌ అందించాలని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:05 AM