Share News

వేతనాలు అడిగితే దౌర్జన్యం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:37 AM

ఐదు నెలలుగా రావాల్సిన వేతనాలు, పీఎఫ్‌ బకాయిలు అడిగినందుకు డీఈ శ్రీనివాసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డార ని శ్రీరామిరెడ్డి తాగు నీటి పథకం కార్మికులు పేర్కొన్నారు.

వేతనాలు అడిగితే దౌర్జన్యం

ఉరవకొండ, జనవరి16: ఐదు నెలలుగా రావాల్సిన వేతనాలు, పీఎఫ్‌ బకాయిలు అడిగినందుకు డీఈ శ్రీనివాసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డార ని శ్రీరామిరెడ్డి తాగు నీటి పథకం కార్మికులు పేర్కొన్నారు. దౌర్జన్యానికి పాల్పడి న డీఈపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్మికులు సోమవారం పోలీస్‌ స్టేషన వద్ద ఆందోళన చేపట్టారు. చేయని తప్పును మాపై మోపారని కార్మికు లు ఆవేదన వ్యక్తం చేశారు. లైనలో అంతరాయం ఏర్పడడానికి వాల్వ్‌ క్లోజ్‌లో ఉన్నప్పుడు రన చేయడమే కారణమన్నారు. సొల్లాపురం సర్పంచ దళిత కార్మికు లను దుర్భాషలడారని పేర్కొన్నారు. లైన లీక్‌ కావడానికి కారణం సర్పంచు భాస్కర్‌రెడ్డి, డీఈ శ్రీనివాసులు కారకులు అని తెలిపారు. వారిపై కేసు నమో దు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 12:37 AM