Share News

PHC : కలగానే... రొద్దం పీహెచసీ నిర్మాణం

ABN , Publish Date - May 19 , 2024 | 11:30 PM

మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనులు కలగానే మిగిలేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 2020వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం నూతన భవనానికి రూ. 1.5 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్‌ శ్రీనివాసులు రూ.25లక్షలతో పునాది పనులను పూర్తి చేశారు.

PHC : కలగానే... రొద్దం పీహెచసీ నిర్మాణం
New building construction works stopped at the foundations

నాలుగేళ్లుగా నిలిచిపోయిన కొత్త భవనం పనులు

శిథిలావస్థలో పాత భవనం, సిబ్బంది క్వార్టర్లు

రొద్దం, మే 19 : మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనులు కలగానే మిగిలేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 2020వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం నూతన భవనానికి రూ. 1.5 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్‌ శ్రీనివాసులు రూ.25లక్షలతో పునాది పనులను పూర్తి చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.15లక్షలకు బిల్లు పెట్టడంతో ఆయన పనులను అర్ధంతరంగా ఆపేశారని ప్రజలు చర్చించు కుంటు న్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పనులు జరుగ లేదు. పునాదులపై కంపచెట్లు బాగా పెరిగిపోయాయి. అంతేగాకుండా పనులను అర్ధంతరంగా ఆపేయడంతో... భవన నిర్మాణం పనులు పూర్తిగా రద్దయినట్లు స మాచారం. దీంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కొత్త భవనాల నిర్మాణం రొద్దం మం డల వాసులకు కలగా మిగిలిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


శిథిలావస్థలో ఉద్యోగుల క్వార్టర్స్‌

రొద్దం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేసే సిబ్బంది కోసం 40ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉద్యోగులు స్థానికంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వాటిని నిర్మించారు. చాలా ఏళ్లు గా మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. వర్షం వచ్చినప్పుడు కారుతున్నాయి. దీంతో సిబ్బంది ఆ క్వార్టర్లలో ఉండలేక హిందూ పురం, పెనుకొండ తదితర ప్రాంతాలలో నివాసముంటున్నారు. ఆ నుంచి బస్సుల్లో వచ్చి వెళ్తున్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గదులు వర్షం వచ్చినప్పుడు తడుస్తోంది. విలువైన మందులు, వ్యాక్సిన్లకు భద్రత లేకుండా పోతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పెద్దమంతూరు పీహెచసీ నిర్మాణానికి నిధులేవీ...?

రొద్దం మండల పరిధిలోని పెద్దమంతూరులో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఏడా ది కిందట కొత్తగా మంజూరైంది. ఇద్దరు వైద్యులు, ఎంపీహెచఓ, సూపర్‌ వైజర్‌ పోస్టులు మంజూరయ్యాయి. రొప్పాల సమీపంలో స్థలం చూపించారు. నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనుల కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా... నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయా రైంది. పెద్దమంతూరు సమీప గ్రామ ప్రజలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మంజూ రైందని ఎంతో సంబరపడ్డారు. అయితే నిధులు లేక కొత్త భవనాలు నిర్మించ కపోవడంతో ప్రజలు వైద్య సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్న పెద్దమం తూరు ఆరోగ్య ఉపకేంద్రంలోనే వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు.

కట్టించేందుకు ఆర్డీటీ సిద్ధమా..?

పెద్దమంతూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కట్టించేందుకు ఆర్డీటీ కృషిచేస్తున్న ట్లు సమాచారం. అయితే ఆర్డీటీకి వచ్చే విదేశీ విరాళాలకు కేంద్రం బ్రేక్‌ వేయడం తో... నిధులు రాక ఆ సంస్థ వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభు త్వం నిధులు మంజూరు చేయక తాత్సారం చేయడంతో ఆరోగ్యకేంద్రం పనులు జరగలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జూననెలలో కొలువదీరే కొత్త ప్రభుత్వమైనా రెండు చోట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను కట్టించి ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 11:30 PM