Share News

ఆర్యవైశ్యులను వర్గాలుగా చీల్చారు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:05 AM

వైసీపీ పాలనలో సీఎం జగన.. ఆర్యవైశ్యులను నానా ఇబ్బందులు పెట్టారనీ, నాలుగు వర్గాలుగా విభజించాడని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్‌ మండిపడ్డారు. స్థానిక పరమేశ్వరి హాల్‌లో శనివారం రాత్రి వ్యాపారి గళం పేరుతో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో డుండి రాకేష్‌ మాట్లాడుతూ.. కులగణన పేరుతో ఆర్యవైశ్యులను సీఎం జగన నాలుగు వర్గాలుగా చీల్చాడన్నారు.

ఆర్యవైశ్యులను వర్గాలుగా చీల్చారు
మాట్లాడుతున్న వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్‌

ఒక్కచాన్స పేరుతో జగన వంచించారు

వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులపై పెరిగిన దాడులు

విచ్ఛిన్నమైన వ్యాపారాలు

టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్‌

హిందూపురం, మార్చి 23: వైసీపీ పాలనలో సీఎం జగన.. ఆర్యవైశ్యులను నానా ఇబ్బందులు పెట్టారనీ, నాలుగు వర్గాలుగా విభజించాడని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్‌ మండిపడ్డారు. స్థానిక పరమేశ్వరి హాల్‌లో శనివారం రాత్రి వ్యాపారి గళం పేరుతో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో డుండి రాకేష్‌ మాట్లాడుతూ.. కులగణన పేరుతో ఆర్యవైశ్యులను సీఎం జగన నాలుగు వర్గాలుగా చీల్చాడన్నారు. తద్వారా ఆర్యవైశ్యుల బలం తక్కువ చేసి, చూపించే ప్రయత్నం చేశాడన్నారు. టీడీపీ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన ఏర్పాటుచేసి రూ.30 కోట్లు కేటాయించారన్నారు. పేదలకు సబ్సిడీ రుణాలు అందించారన్నారు. టీడీపీ హయాంలో పన్నుల భారం లేదన్నారు. ప్రస్తుతం చెత్త పన్ను, షాపుల పన్ను, ట్రేడ్‌ లైసెన్స పెంచి ఆర్యవైశ్యులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషనకు ఒక్క రోజు ముందు ఆర్యవైశ్య కార్పొరేషన ఏర్పాటుచేసి కించపరిచారని మండిపడ్డారు. రాజకీయంగా, వ్యాపార పరంగా ఈ ఐదేళ్లలో ఆర్యవైశ్యులు చాలా నష్టపోయారని వాపోయారు. ఆర్యవైశ్యుల గొంతు కోయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తే ఆడ్డుకున్న ఘనత సీఎం జగనకే దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా మోసం జరిగిందనీ, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హిందూపురంలో ఆర్యవైశ్యుల భూముల వ్యవహారంలో అధికార పార్టీలోని ఒకవర్గం మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యాపారుల పరిస్థితి డేంజర్‌ జోనలో పడిందన్నారు. ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చి జగన వంచించాడన్నారు. వీటన్నింటినీ గుర్తుంచుకుని, ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ఎన్నికల్లో కుటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షుడు జేపీకే రాము, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ ఆదర్శ్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వరప్రసాద్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు నంబూరి సతీష్‌, శ్రీకాంత, దాస సందీప్‌, హిమబిందు, వాణిజ్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణాచల రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ రజనీకాంత, ఆర్యవైశ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:05 AM