Share News

election: పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఆర్వో

ABN , Publish Date - May 12 , 2024 | 12:35 AM

నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో ఈనెల 13 వ తేదీన నిర్వహించే ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

election: పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఆర్వో

ధర్మవరం, మే 11: నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో ఈనెల 13 వ తేదీన నిర్వహించే ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


13వ తేదీన పోలింగ్‌ బూతలలో కూర్చునే ఏజెంట్లు నియామకంలో ఫారం-10ని భర్తీ చేసి తగిన సంతకాలతో నేరుగా ఆయా పోలింగ్‌ బూతల పీఓలకు వెంటనే చేర్చాలన్నారు. నియోజకవర్గంలో 290 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్‌యార్డ్‌లో పీఓ, ఏపీఓలకు ఆదివారం పోలీసుబందోబస్తు నడుమ ఎన్నికల సామగ్రిని అందజేస్తామన్నారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. కావున ప్రతి ఓటరు ఓటు హక్కును తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆర్వో తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 12:35 AM