పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 17 , 2024 | 11:53 PM
కదిరిఅర్బన, మార్చి 17: పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి.
కదిరిఅర్బన, మార్చి 17: పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నా యి. పట్టణం, రూరల్‌ల్లో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే శారు. ఇందులో ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల, జూనియర్ కళాశాల, జిల్లాపరిషత బాలికల ఉన్నతపాఠశాల, జూనియర్ కళాశాల, కుటాగుళ్ల, వీవర్సుకాలనీ మున్సిపల్ పాఠశాల, ఊర్దూ మెయిన స్కూల్, కేజీబీవీ, పట్నం జిల్లాపరిషత ఉన్నతపాఠశాల, కుమ్మరవాండ్లపల్లి జిల్లాపరిషత పాఠశాల, కాళసముద్ర గురుకుల పాఠశాలను కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. వాటిల్లో సుమారు 2,380మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ చెన్నకృష్ణ తెలిపారు.